
అ‘పూర్వ’ సమ్మేళనం
ఖమ్మంలీగల్: ఖమ్మంలోని ఆర్ట్స్, సైన్స్ కాలేజీలో 1972 – 1975 బ్యాచ్ బీఎస్సీ (బీజెడ్సీ) విద్యార్థులు ఆదివారం నగరంలోని ఓ హోటల్ లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మొత్తం 27 మంది పూర్వ విద్యార్థులు తమ కుటుంబాలతో కలిసి పాల్గొన్నారు. పాత జ్ఞాపకాలను స్మరించుకున్నారు. ఖమ్మంలో నివసిస్తున్న యరమళ్ల సుదర్శన్‌రావు (రిటైర్డ్ మేనేజర్), ఆళ్ల వెంకట్రావు (రిటైర్డ్ పారా మెడికల్ ఆఫీసర్), బండి సత్యనారాయణ (రిటైర్డ్ జ్యుడీషియల్ ఆఫీసర్), లక్ష్మణ్‌రావు (రిటైర్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్), చి.రామారావు, డి.వెంకటేశ్వ ర్లు, డి.సుధాకర్ పాల్గొన్నారు.