
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే యూరియా కొరత
ఖమ్మంమయూరిసెంటర్ (ఖమ్మంమామిళ్లగూడెం): రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే యూరియా కొరత ఏర్పడగా.. ఈ విషయాన్ని పక్కన పెట్టి కేంద్రంపై అసత్య ప్రచారాలు చేయడం సరికాదని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ సహజంగా ఆగస్టులో యూరియా అవసరం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అయినా అడిగినంత మేర కేంద్రం సరఫరా చేయలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పడం గర్హనీయమని పేర్కొన్నారు. బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై విమర్శలు చేయడాన్ని మాను కోవాలని సూచించారు. సమావేశంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, నాయకులు భూక్యా శ్యాంనాయక్, వేణుగోపాల్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు
శ్రీధర్‌రెడ్డి