
ఆత్మగౌరవ సభను విజయవంతం చేయండి
ఖమ్మం సహకారనగర్: పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం (టీజీ సీపీఎస్ ఈయూ) ఆధ్వర్యాన వచ్చేనెల 1న సీపీఎస్ ఉద్యోగుల ఆత్మ గౌరవసభ నిర్వహిస్తున్నట్లు టీజీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి తెలిపారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిర్వహించే ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌కు గురువారం వచ్చిన ఆయన సీపీఎస్ ఉద్యోగులతో ముఖాముఖి నిర్వహించారు. సెప్టెంబర్ 1న జరిగే సదస్సుకు జిల్లా నుంచి సీపీఎస్ ఉద్యోగులు తరలిరావాలని కోరారు. తొలుత కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిశారు. టీజీ సీపీఎస్ ఈయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లింగమొళ్ల దర్శన్‌గౌడ్, నాగవెల్లి ఉపేందర్ మాట్లాడగా, ఉద్యోగ సంఘాల బాధ్యులు కె.రామకృష్ణ, బానాల రాంరెడ్డి, భిక్షం, గరికె ఉపేంద్రరావు, రవికుమార్, రామదాసు, కొరివి కృష్ణ పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి