
స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా 419 సీట్లు భర్తీ
భద్రాచలంటౌన్: ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీకి బుధవారం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించారు. భద్రాచలంలోని గిరిజన గురుకుల కళాశాలలో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో 419 సీట్లు భర్తీ అయ్యాయని గురుకులాల రీజినల్ కోఆర్డినేట ర్ అరుణకుమారి తెలిపారు. గురుకుల విద్యాలయాల్లో ఐదు నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించగా బాలికలు 121 మంది, బారులు 298 మంది చేరారని వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలోని పలు గురుకులాల ప్రిన్సిపాళ్లు రమాదేవి, రాణి, చైతన్య, మాధవీలత, శిరీష, మాధవి, వీరస్వామి, సురేశ్, శ్యాంకుమార్, హరికృష్ణ, భాస్కర్ పాల్గొన్నారు.