
రాజీవ్ సేవలు మరువలేనివి..
ఖమ్మంమయూరిసెంటర్: భారతరత్న, మాజీ ప్రధాని మంత్రి రాజీవ్‌గాంధీ దేశాభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. రాజీవ్ జయంతి సందర్భంగా బుధవారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించి మాట్లాడారు. దేశ భవిష్యత్ దృష్ట్యా దూరదృష్టితో రాజీవ్‌గాంధీ తీసుకున్న నిర్ణయాలు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీలు పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని బేబీ స్వరణకుమారి, నాయకులు నాగండ్ల దీపక్‌చౌదరి, బాలగంగాధర్ తిలక్, వడ్డేబోయిన నర్సింహారావు, గజ్జెల్లి వెంకన్న, దొబ్బల సౌజన్య, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, బొడ్డు బొందయ్య, సయ్యద్ గౌస్, పుచ్చకాయల వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.