
అదనపు కలెక్టర్‌కు డీఈఓ బాధ్యతలు?
ఖమ్మం సహకారనగర్: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి.శ్రీజకు డీఈఓగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిందని సమాచారం. ఇటీవల పలు జిల్లాల్లో డీఈఓ పోస్టులు ఖాళీ కాగా.. అదనపు కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. కానీ ఖమ్మంలో మాత్రం జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మిని ఆ స్థానంలో నియమించారు. ఈనేపథ్యాన మంగళవారం అదనపు కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించినట్లు తెలిసినా.. స్పష్టత రావాల్సి ఉంది.
31వరకు దరఖాస్తులు
ఖమ్మం సహకారనగర్: తెలంగాణ ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్‌లో ప్రవేశానికి ఈనెల 21వ తేదీ వరకు అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని డీఈఓ నాగపద్మజ, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు తెలిపారు. అలాగే, అపరాధ రుసుముతో ఈనెల 31వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశముందని పేర్కొన్నారు. వివరాలకు 80084 03522 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.