
సౌర విద్యుత్‌కు ప్రతిపాదనలు సమర్పించాలి
ఖమ్మంవ్యవసాయం : ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ విద్యుత్ ప్యానళ్ల ఏర్పాటుకు నిర్ణీత నమూనాల్లో ప్రతిపాదనలు సమర్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి ప్రభుత్వ భవనంపై వీలైనంత మేరకు సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ బిల్లుల వివరాలు, రూఫ్ టాప్ ఏరియా, యూఎస్‌సీ నంబర్, కేటగిరీ(ఎల్‌టీ/హెచ్‌టీ) వంటి వివరాలను ప్రొఫార్మాలో పొందుపర్చాలని తెలిపారు. జిల్లాలో 4,700కు పైగా ప్రభుత్వ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. ఈ మొత్తానికి 30 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవకాశాలు ఉన్నట్లు ఆ శాఖ అధికారులు అంచనాలు వేశారని తెలిపారు. సమావేశంలో డీఆర్‌ఓ పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్‌డీఓ సన్యాసయ్య పాల్గొన్నారు.