
కేంద్ర పన్నుల ఆదాయంలో రాష్ట్రాల వాటా ఎంత?
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్ర పన్నుల నికర ఆదాయంలో 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాలకు రావాల్సిన వాటా ఎంత..? అని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి లోక్‌సభలో ప్రశ్నించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్రాలకు వాటాపై 15వ ఆర్థిక సంఘం సూచన, ప్రభుత్వం చేపట్టిన అధికార వికేంద్రీకరణ స్థాయి, రాష్ట్ర నిర్దిష్ట గ్రాంట్ల వివరాలను తెలపాల్సిందిగా కోరారు. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రాష్ట్రాల వాటా రూ. 12.86 లక్షల కోట్లు. 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్నులు, సుంకాల నికర ఆదాయంలో రాష్ట్రాల వాటా మొత్తం రూ.12,86,885.44 కోట్లు ఉన్నట్లు తెలిపారు. 41 శాతం తక్కువగా ఉందా..? అని ఎంపీ ప్రశ్నించగా 15వ ఆర్థిక సంఘం ఆమోదించిన సిఫార్సుల ప్రకారం ఉన్నట్లు పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు కేంద్రం నేరుగా ఎలాంటి పన్ను కేటాయించలేదని తెలిపారు.
ముమ్మరంగా
వాహనాల తనిఖీ
ఖమ్మంక్రైం: సీపీసునీల్‌దత్ ఆదేశాల మేరకు అడి షనల్ డీసీపీప్రసాద్‌రావు పర్యవేక్షణలో ఆదివా రం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తు ల వేలిముద్రలు సేకరించారు. మద్యం సేవించి పట్టుబడిన వాహనదారులపై కేసు నమోదు చేశారు. ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్ట్ 17వ తేదీ వరకు నిర్వహించిన తనిఖీల్లో 10,141 మంది వాహనదారులు పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు.
లారీడ్రైవర్‌ను మోసగించిన సైబర్ దుండగులు
ఖమ్మంఅర్బన్: రెట్టింపు లాభం వస్తుందని నమ్మించి లారీడ్రైవర్ నుంచి రూ.83,940ను కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఖమ్మంఅర్బన్ (ఖానాపురం హవేలి) పోలీస్‌స్టేషన్లో సోమవారం సైబర్ క్రైమ్ కేసు నమోదైంది. సీఐ భానుప్రకాశ్ కథనంప్రకారం..నగరంలోని శ్రీరాంనగర్‌కు చెం దిన షేక్‌జానీహుస్సేన్‌లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నా డు.‘పెట్టుబడి పెడితే రెట్టింపులాభం వస్తుంది’ అంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రకటనను నమ్మి, మిత్రుడి సూచన మేరకు గత జూలై 23, 24 తేదీల్లో రూ.83,940 వివిధ దపాలుగా చెల్లించాడు. తర్వాత సంబంధిత ఖాతా బ్లాక్ అవడంతో మోసపోయానని సైబర్ క్రైమ్ నంబర్ 1930కి ఫిర్యాదు చేశాడు. రూ.18 వేలు డ్రా కాకుండా నిలువరించారు. బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.