
ఇరు వర్గాల మధ్య ఘర్షణ
ఖమ్మంఅర్బన్:మద్యం మత్తు లో జరిగిన గొడవ ప్రాణాలమీదకు తెచ్చింది. నగరంలోని గోపాలపురం ప్రాంతంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన దేవందల కార్తీక్ (30) ఆస్పత్రిలో చికిత్సపొందుతూ సోమవా రం మృతిచెందాడు. ఖమ్మంఅర్బన్ (ఖానాపురం హవేలీ) పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. గోపాలపురం పరిధిలో మద్యం మత్తులో కొందరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలకు చెదిన 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఇద్దరు పరారీలో ఉండగా, మరో ఇద్దరు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వారిలో తీవ్రంగా గాయనపడిన కార్తీక్ సోమవారం మృతి చెందాడు. కొందరు వ్యక్తులు ప్రేరేపించడమే ఘర్షణకు కారణమని మృతుడు కార్తీక్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడి బంధువు దుర్గాభవాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడి కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేస్తామని సీఐ భానుప్రకాష్ తెలిపారు.
యువకుడు మృతి