గోపా ఉపాధ్యక్షుడికి డాక్టరేట్‌ | - | Sakshi
Sakshi News home page

గోపా ఉపాధ్యక్షుడికి డాక్టరేట్‌

Aug 18 2025 6:13 AM | Updated on Aug 18 2025 6:13 AM

గోపా

గోపా ఉపాధ్యక్షుడికి డాక్టరేట్‌

ఖమ్మంమామిళ్లగూడెం: పాండిచేరి యునైటెడ్‌ నేషన్స్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌కౌన్సిల్‌ నుంచి ఖమ్మానికి చెందిన గౌడ అఫీషియల్స్‌, ప్రొ ఫెషనల్స్‌ అసోసియేషన్‌ (గోపా) ఉపాధ్యక్షుడు తోడేటి దుర్గాప్రసాద్‌గౌడ్‌కు గౌరవ డాక్టరేట్‌ లభించింది. 20 ఏళ్లుగా ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన సంస్థ పాండిచేరిలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

ఒకేరోజు 18 మంది నగదు చెల్లింపు

ఖమ్మంసహకారనగర్‌: ఖమ్మంరూరల్‌ మండలం పోలేపల్లిలోని రాజీవ్‌ స్వగృహ భవన సముదాయంలో ఆదివారం ఒక్క రోజే 18 మంది నగదు కట్టి రిజిస్టర్‌ చేసుకున్నట్లు తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ జనరల్‌ సెక్రటరి ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. ఇటీవల కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి రాజీవ్‌ స్వగృహ నిర్మాణం, నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. 60 ఫీట్ల అప్రోచ్‌ రోడ్డు మంజూరైందని, మున్నేరు వరద ప్రభావం రాకుండా రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం జరుగుతోందని, ఈ భవన సముదాయానికి బఫర్‌ జోన్‌ వర్తించదని కలెక్టర్‌ పేర్కొనటంతో పాటు అదనంగా కావాల్సిన సౌకర్యాలు కూడా ప్రభుత్వం తరఫున కల్పిస్తామని కలెక్టర్‌ హామీ ఇవ్వడంతో ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆదివారం ప్లాట్లు రిజిస్టర్‌ చేసుకున్నారు. అందులో డీఆర్‌డీఏ పీడీ సన్యాసయ్య, సూర్యాపేట జెడ్పీ సీఈఓ అప్పారావు, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ కస్తాల సత్యనారాయణ, చింతకాని ఎంపీడీఓ సీహెచ్‌ శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్‌, కె.పెద్దపుల్లయ్య, హరికృష్ణ, సాయికృష్ణ, డి.నిర్మల ఉన్నారు.

పూర్వ విద్యార్థుల

ఆత్మీయ సమ్మేళనం

ఖమ్మంసహకారనగర్‌: నగరంలోని ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల 1981 – 84 బీఏ (ఈపీపీ) బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు ఆది వారం నగరంలోని ఓ హోటల్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా అందరి ఫొటోలు, చిరునామాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. 70 ఏళ్లు దాటిన చంద్రయ్య, రామారావును సన్మానించారు. కార్యక్రమంలో జమిల్‌ పఠాన్‌, శ్రీహరి, కె.నర్స య్య, హరినాథ్‌, సుదర్శన్‌, రౌతు రవి, ఎస్కే బాబు తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్‌ మోటార్‌ చోరీ

మధిర: పట్టణంలోని సుందరయ్య నగర్‌లో శనివారం రాత్రి విద్యుత్‌ మోటార్‌ చోరీ జరిగింది. గండ్ర నరసింహారావు ఇంటి ఆవరణలో ఉన్న విద్యుత్‌ మోటార్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఇంటి యజమాని ఆదివారం ఉదయం చూడగా విద్యుత్‌ వైర్లు కత్తిరించి మోటార్‌ ఎత్తుకెళ్లినట్లు గుర్తించాడు. ఇటీవల రైల్వే అండర్‌ బ్రిడ్జి సమీపంలో బబ్లూకి చెందిన మోటార్‌ సైకిల్‌ చోరీకి గురైంది. వరుస చోరీలతో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

ప్రేమ్‌కుమార్‌

మృతదేహం లభ్యం

గంగారం: మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం ఏడుబావుల జలపాతం వద్ద శనివారం సాయంత్రం గల్లంతైన ప్రాపర్తి ప్రేమ్‌కుమార్‌ (23) మృతదేహం లభ్యమైంది. ఏన్కూరు మండలం జెన్నారం ఎస్టీ కాలనీకి చెందిన ప్రాపర్తి ప్రేమ్‌కుమార్‌ శనివారం బంధువులు, స్నేహితులతో కలిసి ఏడుబావుల జలపాతం వద్దకు వచ్చాడు. పైనున్న బావులను చూసేందుకు వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారి బావిలో పడ్డాడు. దీంతో సహచరులు ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. ఆదివారం మధ్యాహ్నం ప్రేమ్‌కుమార్‌ మృతదేహం లభ్యమైంది. కాగా, సరదాగా జలపాతం చూడడానికి వచ్చి శవమై కనిపించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రేమ్‌కుమార్‌ సోదరుడు సైతం గతంలో వరద ప్రమాదంలోనే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు.

గోపా ఉపాధ్యక్షుడికి డాక్టరేట్‌1
1/3

గోపా ఉపాధ్యక్షుడికి డాక్టరేట్‌

గోపా ఉపాధ్యక్షుడికి డాక్టరేట్‌2
2/3

గోపా ఉపాధ్యక్షుడికి డాక్టరేట్‌

గోపా ఉపాధ్యక్షుడికి డాక్టరేట్‌3
3/3

గోపా ఉపాధ్యక్షుడికి డాక్టరేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement