జ్వరంతో ఇద్దరు మృతి | - | Sakshi
Sakshi News home page

జ్వరంతో ఇద్దరు మృతి

Aug 18 2025 6:13 AM | Updated on Aug 18 2025 6:13 AM

జ్వరం

జ్వరంతో ఇద్దరు మృతి

కొణిజర్ల: జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందిన ఘటన మండలంలోని తనికెళ్లలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, మృతురాలి కుటుంబ సభ్యుల కథ నం ప్రకారం.. తనికెళ్లకు చెందిన తద్దెస్వాతి (18) ఖమ్మంలో డిగ్రీ చదువుతోంది. నాలుగు రోజుల కిందట తీవ్రజ్వరం రావడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో రెండు రోజుల కిందట హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. విద్యార్థిని డెంగీ లక్షణాలతో మృతిచెందినట్లు కటుంబ సభ్యులు తెలిపారు. వివరణ కోరేందుకు పెద్దగోపతి వైద్యాధికారులను ఫోన్‌లో సంప్రదించగా స్పందించలేదు.

డెంగీ లక్షణాలతో బాలుడు

డెంగీ లక్షణాలతో బాలుడు మృతిచెందిన ఘటన మండలంలోని గుబ్బగుర్తిలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బలమాల ప్రసాద్‌, అనూష దంపతుల కుమారుడు వినయ్‌ (5) నాలుగురోజులుగా తీవ్రజ్వరంతో బాధపడుతున్నాడు. ఖమ్మంలోని ప్రైవే ట్‌ అస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. డెంగీ లక్షణాలతోనే బాలుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

ఆర్థిక బాధలు తాళలేక ఆత్మహత్య

ఖమ్మంక్రైం: ఆర్థిక బాధలు తాళలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం త్రీటౌన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ మోహన్‌బాబు కథనం ప్రకారం.. పంపింగ్‌వెల్‌రోడ్‌ ప్రాంతానికి చెందిన లింగనబోయిన నాగరాజు (40) కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. అంతేకాకుండా ఆయన కుమార్తె మెదడువాపు వ్యాధితో బాధపడుతోంది. భార్య ఆరోగ్యం కూడా బాగా లేకపోవటంతో మనస్థాపానికి గురై ఈ నెల7న ఎలుకలమందు తాగాడు. ఆయన్ను ప్రభుత్వాస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పేకాట స్థావరంపై దాడి

ఎర్రుపాలెం: మండలంలోని అయ్యవారిగూడెం సమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఐ రమేశ్‌కుమార్‌ కథనం ప్రకారం.. అయ్యవారిగూడెం సమీపంలో కొద్ది రోజులుగా కొందరు పేకాట ఆడుతున్నారు. సమాచారం మేరకు ఆదివారం స్థానిక పోలీసులు పేకాట కేంద్రంపై దాడి చేశారు. ఆరుగురిని అరెస్ట్‌ చేసి, వారి వద్ద నుంచి రూ.7,240 నగదు, ఐదు సెల్‌ఫోన్‌లు, 15 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మరో 9 మంది పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

జ్వరంతో ఇద్దరు మృతి1
1/1

జ్వరంతో ఇద్దరు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement