
పోటెత్తి.. రోడ్లపైకి చేరి
● పలు చోట్ల నిలిచిన రాకపోకలు ● ఇళ్లలోకీ వరద రావడంతో ప్రజల ఆందోళన
వైరా: వైరా రిజర్వాయర్‌కు వరద పోటెత్తుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 18.3 అడుగులు కాగా ప్రస్తుతం 20అడుగులకు ఉంది. రిజర్వాయర్‌లోకి సామర్థ్యానికి మించి నీరు చేరడంతో రాజీవ్‌నగర్ కాలనీలోకి వరద చేరగా స్థానికులను జెడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలకు తరలించారు. మున్సిపల్ కమీషనర్ చింతా వేణు, తహసీల్దార్ కే.వీ.శ్రీనివాస్, ఎస్సై రామారావు ఆధ్వర్యాన పరిశీలంచి వసతులు కల్పించారు.
●కొణిజర్ల: మండలంలోని పలు గ్రామాల మీదుగా ప్రవహించే పగిడేరు ఉధృతితో పలు గ్రామల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. శనివారం మధ్యాహ్నా నికి వాగు ఉధృతి తగ్గడంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి. కాగా, పగిడేరు, నిమ్మవాగు వరద ఉధృతితో వైరా రిజర్వాయర్‌కు భారీగా వరద చేరగా, సమీపంలోని పెద్దరాంపురం ఇళ్లలోకి నీరు చేరింది. అలాగే, పలుచోట్ల పంటలు నీటమునిగాయి.
●రఘునాథపాలెం: చిన్న వర్షానికే బుగ్గవాగు పొంగి పొర్లి ప్రవహిస్తుండడంతో రాకపోకలు ఆగిపోతున్నాయని రఘునాథపాలెం మండలం వీఆర్.బంజర గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం వరకు వంతెనపై ప్రవామం ఉండడంతో ఇబ్బందులు ఎదరయ్యాయి. కాగా, డోర్నకల్ – ఖమ్మం మార్గంలో రాకపోకలు నిలిపివేయగా ఎంపీఓ శ్రీనివాసరెడ్డి, గ్రామాల కార్యదర్శులు నాగరాజు, హిమబిందు, పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
●కామేపల్లి: మండలంలోని పొన్నేకల్ బుగ్గవాగు ఉధృతితో లింగాల–డోర్నకల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బుగ్గవాగు వరద ఉధృతిని డీపీఓ ఆశాలత, డీఎల్‌పీఓ రాంబాబు, సీఐ తిరుపతిరెడ్డి, ఎస్సై సాయికుమార్ పరిశీలించారు.
●తల్లాడ: మండలంలో బిల్లుపాడు–రామచంద్రాపురం మధ్య, వెంగన్నపేట–నూతనకల్ మధ్య వాగులు, మిట్టపల్లి, పినపాక వద్ద వాగులు ఉధృతరూపం దాల్చగా రాకపోకలు స్తంభించాయి.
●వైరా రిజర్వాయర్ నుంచి అలుగుల ద్వారా వర ద దిగువకు చేరి వైరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలుగ్రామాలకు రాకపోకలు ఆగిపోయా యి. ఎస్సై పుష్పాల రామారావు, ట్రెయినీ ఎస్సై వెంపటి పవన్ స్నానాల లక్ష్మీపురంలోని వైరా నది ఉధృతిని పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు.
●కారేపల్లి: మండలంలోని పేరుపల్లి వద్ద లోలెవల్ బ్రిడ్జి పైనుంచి బుగ్గవాగు ప్రవాహంతో రాకపోకలను నిలిపివేశారు. బుగ్గవాగు ఒడ్డున నిర్మించిన డబుల్ బెడ్‌రూం కాలనీలోకి వరద చేరడంతో సీఐ తిరుపతిరెడ్డి, ఎస్‌ఐ బి.గోపి, ఎంపీడీఓ రవీంద్రప్రసాద్ తదితరులు స్థానికులను హైస్కూల్ పునరావాస కేంద్రానికి తరలించారు. అలాగే, డీపీఓ ఆశాలత, డీఎల్‌పీఓ రాంబాబు పరిశీలించారు. ఇక పలుచోట్ల పత్తిచేన్లలోకి నీరు చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
●ఏన్కూరు: మండలంలో భారీ వర్షానికి చెరువులు నిండగా, వాగులు పొంగాయి. జన్నారం– అంజనపురం వద్ద నిమ్మవాగు ప్రవాహంతో రాకపోకలు ఆటంకం ఎదురైంది. లోతట్టు ప్రాంతాల పొలాల్లో వరద నిలిచింది.
●నేలకొండపల్లి: మండలంలోని రాజేశ్వరపురం– శంకరగిరితండా మధ్య రహదారి వరద తాకిడికి కొట్టుకపోయింది. ఇక్కడ బ్రిడ్జి నిర్మించే క్రమాన పక్కన వేసిన రహదారి రాజేశ్వరపురం చెరువు అలుగు ప్రవాహంతో కొట్టుకపోయింది. అలాగే, వరి పొలాలు నీట మునిగాయి. ఈమేరకు పంచాయతీ కార్యదర్శులు రాకపోకలను నిలిపివేసి పహారా ఏర్పాటుచేశారు.

పోటెత్తి.. రోడ్లపైకి చేరి

పోటెత్తి.. రోడ్లపైకి చేరి

పోటెత్తి.. రోడ్లపైకి చేరి