వెలాసిటీ.. విజయకేతనం
వెలాసిటీ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించారని చైర్మన్ శెట్టి లక్ష్మణ్‌రావు, సెక్రటరీ, కరస్పాండెంట్ మల్లోలు రవి, అకడమిక్ డీన్ యాకూబ్ తెలిపారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో బి.శృతి 470కి 468మార్కులు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించగా, ఏ.రూప, పి.ఉభయ్ కృష్ణ 466, ఏ.సింధు 464, ఎస్.కే.పాషా 463మార్కులు సాధించారన్నారు. బైపీసీలో వి.చాందిని 434మార్కులు, సీఈసీలో ఆర్. శిరీష 475మార్కులు సాధించారని వెల్లడించగా.. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.


