
‘మా ఊర్లో మా రాజ్యం’ ఉద్యమం
మణుగూరు టౌన్: మా ఊర్లో మా రాజ్యం స్థాపన కోసం ప్రత్యేక ఉద్యమం చేపడతామని జాతీయ ఆదివాసీ నేత, మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి చందా లింగయ్య దొర పేర్కొన్నారు. ఆదివారం తొగ్గూడెం సమ్మక్క–సారలమ్మ ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ఆదివాసీలను విస్మరించి లంబాడా తెగకు మాత్రమే టికెట్లు ఇచ్చాయని ఆరోపించారు. ఆదివాసీలకు అన్యాయం చేయడాన్ని నిరసిస్తూ ఎన్నికల ఫలితాల అనంతరం పోరాటం చేస్తామన్నారు. నాయకులు వట్టం ఉపేంద్ర, అలెం కోటి, ముక్తి రాజు, కొడెం వెంకటేశ్వర్లు, పాయం సత్యనారాయణ, పొడుగు శ్రీనాథ్ రమణాల లక్ష్మయ్య, వట్టం నారాయణ, పొడెం రత్నం, వాసం కృష్ణయ్య, పొదెం కృష్ణ ప్రసాద్, వజ్జా నర్సింహారావు, వర్స శ్రీను, చందా మహేశ్, బుర్రా యాదగిరి, చింత కృష్ణ, కుంజా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీ జేఏసీ నేత చందా లింగయ్య