సీడీ కేసు: సిట్‌ విచారణకు రమేశ్‌ జార్కిహోళి గైర్హాజరు  | Karnataka CD Case Ramesh Jarkiholi Skips SIT Inquiry | Sakshi
Sakshi News home page

సీడీ కేసు: రమేశ్‌ జార్కిహోళికి అనారోగ్యం, సిట్‌ విచారణకు గైర్హాజరు

Apr 3 2021 10:15 AM | Updated on Apr 3 2021 1:06 PM

సిట్‌ అధికారులపై ఎవరూ ఒత్తిడి చేయరాదని రాష్ట్ర డీజీపీ ప్రవీణ్‌సూద్‌ స్పష్టం చేశారు. సిట్‌ అధికారులు తమ విధులను నిర్వర్తిస్తారన్నారు.

సాక్షి, బెంగళూరు: రాసలీలల సీడీ కేసుకు సంబంధించి సిట్‌(ఎస్‌ఐటీ) చేపట్టిన విచారణకు కర్ణాటక మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహోళి గైర్హాజరయ్యారు. శుక్రవారం ఆయన బెంగళూరులో సిట్‌ ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా రమేష్‌ జార్కిహొళి విచారణకు హాజరు కాలేదని ఆయన తరఫు న్యాయవాది శ్యామ్‌ సుందర్‌ సిట్‌ అధికారులకు తెలిపారు.

వచ్చే సోమవారం వరకు గడువు ఇవ్వాలని కోరారు. ఇలా ఉండగా, సీడీ కేసుకు సంబంధించి విచారణ చేస్తున్న సిట్‌ అధికారులపై ఎవరూ ఒత్తిడి చేయరాదని రాష్ట్ర డీజీపీ ప్రవీణ్‌సూద్‌ స్పష్టం చేశారు. సిట్‌ అధికారులు తమ విధులను నిర్వర్తిస్తారన్నారు. శుక్రవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. నిష్పక్షపాతంగా పని చేయాలని ప్రభుత్వం వారిని నియమించిందన్నారు.   
(చదవండి: యువతి, జార్కిహొళి గదుల్లో సిట్‌ తనిఖీలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement