Electric Scooter: మంటల్లో కాలిపోయిన ఎలక్ట్రిక్ స్కూటర్

బనశంకరి: కర్ణాటకలోని బెంగళూరులో ఆనేకల్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ అగ్నికి ఆహుతైన ఘటన శనివారం జరిగింది. జూజువాడికి చెందిన సతీశ్ అనే కార్మికుడు తన ఎలక్ట్రిక్ స్కూటర్ వేసుకుని బొమ్మసంద్ర వద్ద గల పారిశ్రామికవాడలో ఉద్యోగానికి బయలుదేరాడు.
కొంతదూరం ప్రయాణించగానే స్కూటర్ బ్యాటరీలో నుంచి పొగలు, మంటలు రావడంతో దానిని రోడ్డు పక్కన నిలిపేశాడు. క్షణాల్లో స్కూటర్ కాలిపోయింది. స్థానికులు నీళ్లు చల్లి మంటలను ఆర్పడానికి యత్నించినా ఫలితం లేకపోయింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు.
ఇది కూడా చదవండి: యువతి డెడ్ బాడీ కలకలం.. వీడియో వైరల్