దొడ్డబళ్లాపురం: పోలీస్ కానిస్టేబుల్ పరీక్షల్లో 25 మార్కులు పొందిన అభ్యర్థి, వీఏఓ పరీక్షల్లో 151 మార్కులు సాధించి రాష్ట్రానికే టాపర్‌గా నిలిచిన శంకర్ బన్నూరు మోసం బయటపడింది. హావేరి జిల్లా హానగల్‌కు చెందిన శంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నిజాలు వెలుగు చూశాయి. తాను పరీక్షా కేంద్రానికి మొబైల్‌ఫోన్‌ను తీసికెళ్లి గూగుల్ లెన్స్ యాప్ ద్వారా పరీక్ష రాసినట్టు ఒప్పుకున్నాడు. పరీక్షా కేంద్రంలోని సీసీ కెమెరా చిత్రాలను పరిశీలించగా శంకర్ చెప్పింది నిజమని తేలింది. తనిఖీలను దాటుకుని మొబైల్‌ఫోన్ తీసుకెళ్లానని, చివరి బెంచ్‌లో తన నంబర్ ఉండడం కలిసి వచ్చిందన్నారు.
చెట్టు కూలి 50 బైక్‌లు నుజ్జు
మండ్య: మండ్య జిల్లాలోని శ్రీరంగపట్నం పట్టణంలోని కేఎస్‌ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న స్కూటర్ పార్కింగ్ స్థలంలో ఒక భారీ మర్రిచెట్టు కూలిపోవడంతో, 50కి పైగా స్కూటర్లు, బైక్‌లు దెబ్బతిన్నాయి. ఆదివారం ఉదయం భారీ చెట్టు ఆకస్మాత్తుగా కూలింది. ఇద్దరు వాహనదారులు, ఇద్దరు పార్కింగ్ సిబ్బంది, ఇద్దరు చిన్నారులు తృటిలో క్షేమంగా తప్పించుకున్నారు. సీఐ బి.జి. కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పార్కింగ్‌కు పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్న నిర్వాహకులు కనీస భద్రతా చర్యలు తీసుకోవడం లేదు. అందుకే చెట్టు కూలి తమ వాహనాలు ధ్వంసమైనట్లు యజమానులు వాపోయారు. నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.


