లైట్లు పాడై ఈత కొలనులోకి కరెంటు! | - | Sakshi
Sakshi News home page

లైట్లు పాడై ఈత కొలనులోకి కరెంటు!

Nov 2 2026 1:59 AM | Updated on Nov 2 2026 1:59 AM

బనశంకరి: బెంగళూరులో హలసూరులోని కాన్రాడ్‌ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లోని స్విమ్మింగ్‌పూల్‌లో ఇద్దరు విదేశీయులు కరెంటు షాక్‌తో మరణించిన కేసులో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. పూల్‌లో అలంకారం కోసం అమర్చిన విద్యుద్దీపాల నుంచి కరెంటు ప్రసారమైనట్లు కనుగొన్నారు. ఆ పూల్‌ని పోలీసులు, బెస్కాం అధికారులు పరిశీలించగా నీళ్లలోకి విద్యుత్‌ ప్రసారం కావడం వల్లనే ఘోరం జరిగిందని తేల్చారు. ఇందులో హోటల్‌ నిర్వహణ సిబ్బంది నిర్లక్ష్యం ఉండవచ్చని పేర్కొన్నారు. లైట్లు పాడై నీరు చేరడం వల్ల విద్యుత్‌ ఆ కొలను అంతా వ్యాపించి ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు అలెగ్జాండర్‌ (57), ఓరియాట్‌ (45)ల మృతదేహాలకు బౌరింగ్‌ ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిపి కుటుంబసభ్యులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement