బ్రహ్మగిరి కొండపై పేలుళ్లు | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మగిరి కొండపై పేలుళ్లు

Oct 17 2026 6:42 AM | Updated on Oct 17 2026 6:42 AM

● విరిగిపడ్డ పెద్దపెద్ద బండరాళ్లు

● ఆందోళనలో గ్రామస్తులు

దొడ్డబళ్లాపురం: ప్రసిద్ధి చెందిన పర్యాటక స్థలం నందికొండ పక్కన ఉన్న బ్రహ్మగిరి కొండ మీద గురువారం పేలుళ్లు సంభవించాయి. పేలుడు ధాటికి పెద్దపెద్ద బండరాళ్లు విరిగి పడ్డాయి. ఈ సంఘటనతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొండకింద ఉన్న కణివెపుర గ్రామస్తులు ఈ దృశ్యాలను తమ మొబైళ్లలో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి. అదృష్టవశాత్తు బండరాళ్లు కిందకు పొర్లుకుంటూ వచ్చినప్పుడు కొండ కింద పశువులు, గొర్రెల కాపర్లు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. పేలుడు ఎందుకు జరిగింది, ఇందుకు కారణం ఎవరనేది ఇంకా తెలియ రాలేదు.

జాతీయ రహదారిలో చిరుత మృతి

హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా కానాహొసహళ్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరుత పులి మృతి చెందింది. ఈ ఘటన కానాహొసహళ్లి సమీపంలోని బణవికల్లు–అమలాపూర్‌ గ్రామాల మధ్య చోటు చేసుకుంది. రహదారిని దాటుతున్న సమయంలో వాహనం ఢీకొని చిరుత మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిరుత మృతికి దారి తీసిన పరిస్థితుల పైవివరాలు సేకరించారు.

రిటైర్డ్‌ ఎకై ్సజ్‌ అధికారికి ఐదేళ్లు కారాగార వాసం

● కుమార్తెకు మూడేళ్ల జైలు శిక్ష

● అక్రమ ఆస్తుల కేసులో కోర్టు తీర్పు

బనశంకరి: అక్రమ నగదు బదిలీ నియంత్రణ యాక్ట్‌ కింద ఈడీ నమోదు చేసిన కేసులో కీలక తీర్పు వెలువరించింది. ఆదాయానికి మించి అస్తి కూడబెట్టడం, మనీలాండరింగ్‌ చేసిన ఆరోపణలు రుజువు కావడంతో విశ్రాంత ఎకై ్సజ్‌ గార్డ్‌, ఇన్‌చార్జ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.రామచంద్ర, కుమార్తె ఆర్‌.యువరేఖకు బెంగళూరు సీబీఐ ప్రత్యేక కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. ఎం.రామచంద్రకు సీబీఐ ప్రత్యేక కోర్టు 5 ఏళ్ల కఠిన జైలుశిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించింది. కుమార్తె ఆర్‌.యువరేఖకు 3 ఏళ్లు కఠిన జైలుశిక్ష, రూ.3 లక్షల జరిమానా విధించారు. ఆర్థిక నేరాలు, దేశ ఆర్థికతపై తీవ్ర ప్రభావం చూపుతుందని, వైట్‌కాలర్‌ నేరాలని కోర్టు తన తీర్పులో తెలిపింది. 1977 నుంచి ఆదాయానికి మించి ఆస్తులు గడించారని 2009లో లోకాయుక్త పోలీసులు కేసు నమోదుచేశారు. 2022లో రూ.1.79 కోట్ల మొత్తంపై లోకాయుక్త పోలీసులు చార్జిషీట్‌ వేశారు. సిటీ మార్కెట్‌ పరిధిలో ఇన్‌చార్జ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా సేవలందించిన రామచంద్ర తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని, తన కుమార్తె పేరుతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో రుజువైంది. బెంగళూరు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సతీశ్‌ జే.బాలి శుక్రవారం కేసు విచారణ చేపట్టి తీర్పు వెల్లడించారు.

అండర్‌ పాస్‌ జలమయం

● నీటిపై తేలిన వాహనాలు

● ఉద్యాననగరిలో కుంభవృష్టి

దొడ్డబళ్లాపురం: బెంగళూరులోని ఉత్తర భాగంలో శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మికంగా కురిసిన భారీ వర్షం వాహనదారులను ముప్పతిప్పలు పెట్టింది. పణత్తూరులో ఉన్న రైల్వే అండర్‌పాస్‌ దాదాపుగా వర్షం నీటితో నిండిపోవడంతో వాహనాలు నీటిపై తేలియాడాయి. వర్షం నీరు అండర్‌పాస్‌లో నిలిచి పోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నీటిపై కార్లు తేలుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement