డ్రగ్స్‌తో భవిష్యత్‌ నాశనం | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌తో భవిష్యత్‌ నాశనం

Oct 17 2026 6:42 AM | Updated on Oct 17 2026 6:42 AM

రాయచూరు రూరల్‌: మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మానసిక వైద్య నిపుణుడు డాక్టర్‌ పవన్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం వేదాంత డిగ్రీ కళాశాలలో వికసిత భారత్‌ ఆధ్వర్యంలో నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత డ్రగ్స్‌కు అలవాటుపడి తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. యువత గంజాయి, హెరాయిన్‌ వంటి మాదకద్రవ్యాలకు బానిసలు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విద్యార్థుల్లో మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ప్రచార ర్యాలీ, చిత్రలేఖనం, సంగీతం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ తిమ్మయ్య శెట్టి, ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారి తదితరులు పాల్గొన్నారు.

ఐకమత్యంతో హక్కుల సాధన

రాయచూరు రూరల్‌: మడివాళ సమాజం ఐక్యంగా ముందుకు సాగాలని కరంజి మఠాధిపతి ముక్తానంద మహా స్వామిజీ పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలోని మడివాళ మాచిదేవ కళ్యాణ మండపంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. సమాజంలోని విభేదాలను పక్కనపెట్టి, అందరూ ఐక్యంగా రాణించాలని సూచించారు. పిల్లలకు ఉన్నత విద్య అందించడంతో పాటు, సమాజంలో విలువలు పెంపొందించే అంశాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. చిన్నతనం నుంచే పిల్లలకు క్రమశిక్షణ నేర్పించాలని పేర్కొన్నారు. సమాజంలోని అంతర్గత విభేదాలను మరచి హక్కుల సాధనకు ఉద్యమించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మడివాళ సమాజం అధ్యక్షుడు నంజప్ప, గౌరవాధ్యక్షుడు విరుపాక్షి, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయ, చందప్ప, పరశురాం, చంద్రశేఖర్‌, వెంకటేష్‌, జమున, కేశవ్‌ తదితరులు పాల్గొన్నారు.

కారు ఢీకొని

బీజేపీ నేతకు గాయాలు

హుబ్లీ: సవదత్తి బీజేపీ అధ్యక్షుడు, బీడీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్‌ విరుపాక్ష మామని కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అంచనాళ గ్రామం సమీపంలో కారులో ప్రయాణిస్తున్న వేళ శౌచాలయానికి వెళ్లేందుకు వాహనం నిలిపారు. కారు నుంచి కిందకు దిగి కొంచం దూరం వెళ్లారు. ఆ సమయంలో ఓ కారు మామనిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తల, చెవులు, ముక్కుకు గాయాలు కావడంతో రక్తస్త్రావం అయ్యింది. హుటాహుటిన ఆయన్ను సవదత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్సల కోసం ధార్వాడ ఎస్‌డీఎం ఆస్పత్రిలో చేర్పించారు. సవదత్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఆభరణాలు, నగదు చోరీ

హుబ్లీ: ఇంటి తాళం పగలగొట్టిన దుండగులు రూ.లక్షలు విలువైన ఆభరణాలు నగదు చోరీ చేశారు. హుబ్లీ తాలూకా బ్యాహట్టి గ్రామంలో ఈ ఘటన జరిగింది. జాడగెరి వీధిలోని రాజేసాబ్‌ అణ్ణిగేరి ఇంటికి వేసిన తాళాన్ని పగలగొట్టి లోపలికి వెళ్లిన దొంగలు.. రూ.1.46 లక్షల విలువ చేయూ ఆభరణాలు, అలాగే రూ.4 లక్షలు నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై హుబ్లీ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

స్టింగ్‌ ఆపరేషన్‌పై

సీఎందే తుది నిర్ణయం

హుబ్లీ: స్టింగ్‌ ఆపరేషన్‌పై సీఎం డీకే శివకుమార్‌ తగిన నిర్ణయం తీసుకుంటారని మంత్రి బసవరాజ రాయరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ధార్వాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీనేను ఎన్నికల ప్రచారం కోసం వచ్చాను. అందుకని స్టింగ్‌ ఆపరేషన్పై ఎక్కువగా మాట్లాడను. ఈ విషయంలో ముఖ్యమంత్రి తగిన నిర్ణయం తీసుకుంటారు. ఒకొక్కరు ఒకొక్క రీతిలో ప్రకటనలు చేస్తున్నారు. సీబీఐ, సీఐడీ అలాగే జ్యుడిషియల్‌ అని చెబుతున్నారు. వారికి ఇష్టం వచ్చినట్లు వారికి స్థాయికి తగిన విధంగా మాట్లాడుతున్నారు. అందుకే ఈ విషయాన్ని సీఎం విచక్షణకే వదిలి వేశాంశ్రీ అని తెలిపారు. చెరకు రైతులు చేస్తున్న పోరాటంపై మాట్లాడిన ఆయన.. ఈ సమస్యను పరిష్కరించాల్సిందే అని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఇంతే ధర ఇస్తామని చెప్పడం కుదరదని తెలిపారు. చక్కెర శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు ఈ సమస్యపై ఆలోచిస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రైతుల పరంగా తగిన నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement