ట్రావెల్స్‌ బస్సు, లారీ ఢీ | - | Sakshi
Sakshi News home page

ట్రావెల్స్‌ బస్సు, లారీ ఢీ

Oct 17 2026 6:42 AM | Updated on Oct 17 2026 6:42 AM

మైసూరు: మైసూరు జిల్లా పిరియాపట్టణ వద్ద శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3.15 గంటలకు బెంగళూరు–మంగళూరు జాతీయ రహదారిపై ప్రైవేట్‌ ట్రావెల్స్‌ స్లీపర్‌ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్న ఘోర ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో సహా నలుగురు మృతి చెందారు. 35 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను బస్సు డ్రైవర్‌ సునీల్‌ (28), అఫ్తాబ్‌ (23), సిబిల్‌ ఆడమ్‌ (32)గా గుర్తించగా, మరో మృతుడి తెలియరాలేదు. మృతులందరూ కేరళంకు చెందినవారే. కేరళం నుంచి మైసూరు వైపు వస్తున్న లారీ, మైసూరు నుంచి కేరళంకు వెళుతున్న కావేరి ట్రావెల్స్‌ స్లీపర్‌ బస్సును ఎదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు బస్సులోని పలువురు ప్రయాణికుల కాళ్లు, చేతులు, తుంటి, వీపులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారికి పిరియాపట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. తదుపరి మెరుగైన చికిత్స కోసం వారిని మైసూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు.

పరారీలో లారీ డ్రైవర్‌

స్వల్ప గాయాలైన లారీ డ్రైవర్‌ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్‌ ఒక కాలు బస్సులోనే ఇరుక్కుపోవడంతో, అతను అక్కడికక్కడే మరణించాడు. అతని మృతదేహాన్ని బయటకు తీయడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. ఈ ప్రమాదం కారణంగా బెంగళూరు–మంగళూరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. క్రేన్లు, జేసీబీ యంత్రాల సాయంతో ప్రమాదానికి గురైన బస్సు, లారీలను రోడ్డు పక్కకు తరలించడంతో వాహనాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. మైసూరు జిల్లా ఎస్పీ మల్లికార్జున బాలదండి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసిన సీఐ గోవిందరాజ్‌, డీఎస్పీ రవి తదుపరి చర్యలు తీసుకున్నారు.

నలుగురు మృతి

35 మందికి గాయాలు

మృతులంతా కేరళంవాసులే

మైసూరు జిల్లాలో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement