మైసూరు: నాడ హబ్బ మైసూరు దసరా మహోత్సవంలో భాగంగా ఆరో రోజు శుక్రవారం యోగా దసరా జరిగింది. నగరంలోని కర్ణాటక ఎగ్జిబిషన్ అథారిటీ ప్రాంగణంలోని పీ.కళింగ రావు ఆడిటోరియంలో జరిగిన రాష్ట్ర స్థాయి యోగాసనాల పోటీల్లో వందలాది మంది పాల్గొని వివిధ యోగాసనాలు ప్రదర్శించారు. ఈ పోటీల్లో విదేశీయులు కూడా పాల్గొని యోగాసనాలు ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షించారు. కర్ణాటక ప్రభుత్వం యోగా దసరా ఉపసంఘం నిర్వహించే రాష్ట్ర స్థాయి దసరా యోగా పోటీలకు మొత్తం 1,526 మంది పోటీదారులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ పోటీలను వయస్సు ఆధారంగా 12 కేటగిరీలుగా విభజించారు.
యోగా దసరాకు విదేశీయులు
కూడా హాజరు
రాష్ట్ర స్థాయి పోటీల్లో వివిధ రకాల
యోగాసనాల ప్రదర్శన


