బనశంకరి: భక్తులు మొక్కులు తీర్చే కల్పవల్లిగా పూజలందుకుంటున్న బెంగళూరులో బనశంకరిలోని బనశంకరీదేవి ఆలయంలో శనివారం వైభవంగా జన్మోత్సవాలను నిర్వహించారు. భాద్రపద శుద్ధ పౌర్ణమి వేకువజామున అర్చకులు ఏ.చంద్రమోహన్ అమ్మవారి మూలవిరాట్‌కు పంచామృత అభిషేకం, విశేష పూజలు చేపట్టారు. యాగ మండపంలో నవచండికాహోమం, కుమారిక పూజ, సువాసినీ పూజ తదితరాలను నెరవేర్చారు.
శాకంబరీ దేవి ఊరేగింపు
భక్తులు పెద్దఎత్తున అమ్మవారి ఆలయానికి విచ్చేసి నిమ్మకాయల ప్రమిదలతో దీపారాధన చేశారు. మధ్యాహ్నం 2:30 గంటలకు శాకంబరీ దేవికి అలంకరించి ఆలయ ఆవరణలో మేళతాళాలతో ఉరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రముఖులు జీఎన్‌ఆర్.బాబు, శివనగౌడ హెచ్‌సీ, ఎన్.కృష్ణప్ప తదితరులు పాల్గొన్నారు.
ఆలయంలో విశేష పూజలు, యాగాలు


