విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు

Sep 27 2026 1:40 AM | Updated on Sep 27 2026 1:40 AM

హొసపేటె: తమ విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్‌ శృతి సిబ్బందిని కఠినంగా హెచ్చరించారు. శనివారం జిల్లా ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన ఫిర్కా స్థాయి ప్రజా సేవా కార్యక్రమంలో తాలూకా యంత్రాంగం ప్రజల సమస్యలను ఆలకించి, పలు అభ్యర్థనలపై తక్షణమే స్పందించింది. ఈ కార్యక్రమంలో మొత్తం 270 దరఖాస్తులు అందగా, వాటిలో 220 ఇళ్లు, ప్లాట్లకు సంబంధించినవి కాగా, 10 రేషన్‌కార్డులకు, 5 నుంచి 6 పెన్షన్లకు సంబంధించినవి ఉన్నాయని ఆమె తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ ఎర్రగుడి శివకుమార్‌, టీపీ ఈఓ ఆలం పాషా, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మనోహర్‌, ప్రజా పనుల శాఖ అధికారి రవికుమార్‌, జెస్కాం ఈఈ జాన్‌ వెస్లీ, తాగునీరు, పారిశుద్ధ్య శాఖ ఇంజనీర్‌ విజయ్‌కుమార్‌, తాలూకా వైద్య అధికారి డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement