చామంతి రైతులకు నిరాశే | - | Sakshi
Sakshi News home page

చామంతి రైతులకు నిరాశే

Sep 27 2026 1:40 AM | Updated on Sep 27 2026 1:40 AM

హోసూరు: మార్కెట్‌లో చామంతి పూల ధరలు పడిపోయాయి. లాభాలు వస్తాయని ఆశించి చామంతి సాగు చేసిన రైతులు నిరాశ చెందుతున్నారు. హోసూరు, డెంకణీకోట, కెలమంగలం, రాయకోట, అంచెట్టి, తళి తదితర ప్రాంతాల్లో పూల సాగుకు అనుకూలమైన శీతోష్ణస్థితి ఉండడంతో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో వివిధ రకాల చామంతి సాగు చేశారు. ఎకరా పంట సాగుకు రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు పెట్టుకున్నారు. నెల రోజుల క్రితం వరకు కిలో చామంతి మార్కెట్‌లో రూ.150 నుంచి రూ.300 వరకూ ధరలు పలికాయి. వినాయక చవితి అనంతరం మార్కెట్లో పూర్తిగా ధరలు పడిపోయాయి. కిలో చామంతి రూ.30 నుంచి రూ.50 వరకు మాత్రమే ధర పలకడంతో రైతులు నష్టపోతున్నారు.

భారీగా పడిపోయిన ధరలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement