పంట నష్టంపై అధికారుల సర్వే | - | Sakshi
Sakshi News home page

పంట నష్టంపై అధికారుల సర్వే

Sep 27 2026 1:40 AM | Updated on Sep 27 2026 1:40 AM

హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలో వర్షాలు లేక పోవడం వల్ల కానాహొసహళ్లి ఫిర్కా ప్రాంతంలో నెలకొన్న కరువు పరిస్థితిని, పంటల స్థితిని అంచనా వేసేందుకు వ్యవసాయ, రెవెన్యూ శాఖ, పంటల బీమా సంస్థకు చెందిన అధికారుల బృందం సర్వే నిర్వహించింది. తాలూకాలోని కానాహొసహళ్లి, హుడెం, కెంచమల్లనహళ్లి, పూజారహళ్లి, జుమ్మోబనహళ్లి గ్రామాల్లోని రైతులు భూములను అధికారులు సందర్శించి వర్షాకాలపు పంటల పరిస్థితి, వర్షపాతం, పంట పెరుగుదల, వర్షపాతం లేకపోవడం వల్ల పంటలపై కలిగే ప్రభావంపై సర్వే నిర్వహించారు. అధికారులు కరువు పరిస్థితి కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారితో చర్చించి, సమాచారం తెలుసుకున్నారు. కానాహొసహళ్లి రైతు కేంద్రం వ్యవసాయ అధికారి గురు బసవరాజ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement