రాయచూరు రూరల్: రాయచూరు రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని రాయచూరు ఎంపీ కుమార నాయక్ పేర్కొన్నారు. హుబ్లీలోని వెస్ట్ రైల్వే కార్యాలయంలో జనరల్ మేనేజర్ అనంత్‌తో స్టేషన్లలో మందకొడిగా సాగుతున్న పనులపై సమీక్షించారు. గతిశక్తి పథకంలో జరుగుతున్న పనులపై ఆరా తీశారు. ఇప్పటికే కేంద్రం నుంచి రూ.29 కోట్ల నిధులు విడుదల చేసినా పనులు ప్రారంభించక పోవడంపై ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్లలో తాగునీరు, మరుగుదొడ్లు, ప్లాట్‌ఫాంల శుభ్రత సమస్యలపై దృష్టి సారించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న రాయచూరు–గిణిగేరా, గదగ్– వాడి, ఆల్మట్టి– యాదగిరి రైలు మార్గాలతో పాటు గూడ్స్‌షెడ్ నిర్మాణ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. అధికారులు శ్రీనివాస్, బాలాజీ, సునీల్, మీనా బేలాలున్నారు.


