రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో తల్లీబిడ్డల మరణాల రేటును అరికట్టాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కలబుర్గి డివిజన్ అధికారి రజనీ వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం రాయచూరు తాలూకా గుంజళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి మాట్లాడారు. 2025–26లో రూ.3 లక్షలతో చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. 2021–22లో తల్లీబిడ్డల మరణాల రేటు 68 శాతం ఉండగా, నేడు 15 శాతం అయిందన్నారు. జిల్లా ఆరోగ్య అధికారిణి నందిత, సురేంద్ర బాబు, రిమ్స్ డీన్ రమేష్, వైద్యులు గణేష్, శివకుమార్, షాకీర్, ఈశ్వర్, బసయ్యలున్నారు. అనంతరం రిమ్స్ ఆస్పత్రిలో పలు వార్డులను తనిఖీ చేశారు.


