అపౌష్టికత సమస్యకు అంతమెన్నడో? | - | Sakshi
Sakshi News home page

అపౌష్టికత సమస్యకు అంతమెన్నడో?

Sep 27 2026 1:40 AM | Updated on Sep 27 2026 1:40 AM

రాయచూరు రూరల్‌: కళ్యాణ కర్ణాటకలో అపౌష్టికతతో అధిక శాతం పిల్లలు నలిగి పోతున్నారు. కళ్యాణ కర్ణాటక పరిధిలోని కొప్పళ, బీదర్‌, యాదగిరి, కలబుర్గి, రాయచూరు జిల్లాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు, గర్భిణులకు అపౌష్టికత నివారణ కోసం పౌష్టికాహారం అందిస్తున్నారు. భారతీయ కుటుంబ ఆరోగ్య సమీక్షలో భాగంగా 2023–24 గణాంకాల ప్రకారం కళ్యాణ కర్ణాటకలోని ఏడు జిల్లాల్లో ఐదేళ్ల లోపు వయస్సు ఉన్న బాలలు 49.5 శాతం మేర అపౌష్టికతతో విలవిల్లాడుతున్నారు. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 2,38,903 మంది పిల్లలు తక్కువ బరువుతో ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. రాయచూరు జిల్లాలో 2,38,903 మంది బాలలు, కొప్పళ జిల్లాలో 1,65,363 మంది బాలలు, బీదర్‌ జిల్లాలో 1,79,116 మంది బాలలు, యాదగిరి జిల్లాలో 1,59,293 మంది బాలలు, కలబుర్గి జిల్లాలో 3,16,899 మంది బాలలు, విజయ నగర, బళ్లారి జిల్లాల్లో 1,23,441 మంది బాలలున్నారు. ప్రభుత్వం పోషణ్‌ అభియాన్‌, పోషణ్‌ పక్వాడ్‌, పోషణ్‌ ట్రాకర్‌ పథకాలతో బరువు పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సక్రమంగా ఆహార పదార్థాలు అందించక పోవడంతో పాటు నాసిరకమైన ఆహార ధాన్యాలు, పెసలు, పొడి, గోధుమ పిండి, మిరప కాయలు, ఇతర పదార్థాలు అందించడంతో అంగన్‌వాడీ కార్యకర్తలకు తాము ఏం చేయాలో విదితం కావడం లేదు.

అపౌష్టికతకు గురైన బాలురు

తాలూకాలోని ఓ అంగన్‌వాడీ కేంద్రం

కళ్యాణ కర్ణాటకలో

అపౌష్టికత బారిన బాలలు

అంగన్‌వాడీలకు సరిగా అందని

ఆహార ధాన్యాలు

నాసిరకమైన ఆహార పదార్థాలతో

నెరవేరని ప్రభుత్వ లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement