రైతుపై ఎలుగుబంటి ప్రాణాంతక దాడి | - | Sakshi
Sakshi News home page

రైతుపై ఎలుగుబంటి ప్రాణాంతక దాడి

Sep 27 2026 1:40 AM | Updated on Sep 27 2026 1:40 AM

సాక్షి,బళ్లారి/హొసపేటె: ఉమ్మడి బళ్లారి జిల్లాలోని కూడ్లిగి తాలూకా అమలాపుర గ్రామంలో పొలంలో పని చేస్తున్న రైతుపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. శనివారం అమలాపుర గ్రామానికి చెందిన బసవరాజు(40) అనే రైతు తన పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ఒక్కసారిగా అతనిపై ఎలుగుబంటి దాడి చేయడంతో రైతు కిందకు పడిపోయారు. కింద పడిన రైతుపై ఎలుగుబంటి విచక్షణారహితంగా గాయపరిచింది. ఈ దాడిలో బసవరాజ్‌ తలకు, శరీరంలోని పలు భాగాలకు గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చావుబతుకుల మధ్య రైతు కొట్టుమిట్టాడుతున్నారు. ఎలుగుబంటి దాడి చేసి గాయపడిన రైతు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని రైతులపై ఎలుగుబంట్లు దాడి చేసి గాయపరుస్తుండటంతో ఈ ప్రాంతంలోని రైతులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

పట్టించుకోని అధికారులు

అమలాపురతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఎలుగుబంట్లు పలుమార్లు దాడి చేశాయని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కూడ్లిగి తాలూకాలో

ఎలుగుబంట్ల స్వైరవిహారం

భయాందోళనలో అన్నదాతలు,

గ్రామీణ ప్రజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement