నేడు ఉచిత ఆరోగ్య పరీక్ష శిబిరం | - | Sakshi
Sakshi News home page

నేడు ఉచిత ఆరోగ్య పరీక్ష శిబిరం

Sep 27 2026 1:40 AM | Updated on Sep 27 2026 1:40 AM

బళ్లారిఅర్బన్‌: జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహకారంతో బళ్లారి తాలూకా ఉప్పార ఉద్యోగులు, వృత్తి నిపుణుల సంఘం ఆధ్వర్యంలో ఈనెల 27న ఉచిత ఆరోగ్య పరీక్ష శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఉప్పార ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మల్లప్ప ఉప్పార్‌ తెలిపారు. నగరంలోని 17వ వార్డు రూపనగుడి రోడ్డులోని అయ్యప్ప ఆలయ సమీపంలోని విద్యార్థి వసతి గృహంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచిత ఆరోగ్య పరీక్ష శిబిరాన్ని జిల్లా ఆస్పత్రి వైద్య నిపుణుల ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ ఆరోగ్య పరీక్షలతో పాటు వైద్యుల సలహాలను ఉచితంగా అందిస్తారన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంఘం ప్రతినిధులు కోరారు. ఈసందర్భంగా విద్యార్థి వసతి గృహ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంఘం గౌరవాధ్యక్షుడు జేసీ గురుమూర్తి, కిష్కింధ వర్సిటీ ప్రొఫెసర్‌ ఈరన్న, ఉప్పార సమాజ ప్రముఖులు, జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బీసీ రమణ, కేఈబీ నాగరాజ్‌, కార్యదర్శి జయరాం, ఉప్పార సమాజ సోదరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement