చెళ్లకెర రూరల్: చెళ్లకెరలో గురుపౌర్ణమిని పురస్కరించుకుని షిరిడీ సాయి ఆలయం నుంచి చెళ్లకెరమ్మ దేవాలయం వరకూ సాయిబాబా చిత్రపటాన్ని వైభవంగా ఊరేగించారు. ఈ సందర్భంగా జానపద కళా బృందాలు, భజనలు చేపట్టారు. మహిళలు నాగరికులు ఓం శ్రీ సాయి రామ్ నామజపం చేస్తూ భక్తి గీతాలు ఆలపిస్తూ భక్తిని చాటుకున్నారు. అనంతరం సాయి మందిరంలో విశేష పూజలు, మంగళారతి, ధార్మిక కార్యక్రమాలు చేపట్టారు. భక్తులకు శ్రీ వెంకటసాయి సేవ ట్రస్ట్ వారు అన్నదానం చేశారు. కార్యక్రమంలో వెంకటసాయి సేవా ట్రస్ట్ అధ్యక్షుడు బీసీ సంజీవ మూర్తి, బాలెకాయి వెంకటేష్ పాల్గొన్నారు.
శిథిలావస్థలో రంగ మందిరం
బళ్లారి టౌన్: నగరంలోని జోళదరాశి దొడ్డగౌడ రంగమందిరాన్ని మరమ్మతు చేయాలని సీనియర్ కళాకారుల సంఘం అధ్యక్షుడు పీఎల్ గాదిలింగన గౌడ కోరారు. మంగళవారం వేదిక ఆధ్వర్యంలో జిల్లా అధికారిని కలసి వినతిపత్రం కళా మందిరం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందన్నారు. కార్యక్రమాల నిర్వహణకు ఇబ్బందిగా మారిందని తెలిపారు. కళాకారులు ప్రదర్శనలు ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు. సంఘం ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి జగదీశ, పదాధికారులు, జగదీశ్వర స్వామి, లక్ష్మీపతి, వరలక్ష్మీ పాల్గొన్నారు.


