ఈ చిత్రాలు.. ఊహలకు రెక్కలు..
బనశంకరి: బెంగళూరు నగరంలో వసంతా ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఊహలకు రెక్కలు అనే పేరుతో జరుగుతున్న చిత్రకళా ప్రదర్శన ఆకట్టుకుంటోంది. కస్తూరిబారోడ్డు వెంకటప్ప ఆర్ట్ గ్యాలరీలో ఆర్టిస్ట్ కే.మాల్యాద్రి ఆధ్వర్యంలో జరుగుతోంది. సిటీతో పాటు హైదరాబాద్, ఢిల్లీ, ముంబై కి చెందిన 28 మంది చిత్రకారులు గీసిన చిత్రలేఖనాలు అలరిస్తున్నాయి. ప్రకృతి, జీవనం, దేవీ దేవతలు, ఊహాత్మక అంశాలను ఇతివృత్తంగా చేసుకుని గీసిన పెయింటింగ్స్ అబ్బురపరుస్తాయి. రోజూ 10 గంటలనుంచి సాయంత్రం 6 గంటలవరకు ఈ నెల 27 తేదీ వరకు ప్రదర్శన కొనసాగుతుంది.
పెయింటింగ్స్‌ను వీక్షిస్తున్న సంరద్శకులు, (దిగువ) మహిళా చిత్రకారులు
డబ్బులు కాసే చెట్టు
ఈ చిత్రాలు.. ఊహలకు రెక్కలు..
ఈ చిత్రాలు.. ఊహలకు రెక్కలు..


