ఎమ్మెల్యే యత్నాళ్‌పై సుమోటో కేసు | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే యత్నాళ్‌పై సుమోటో కేసు

Feb 26 2026 7:30 AM | Updated on Feb 26 2026 7:30 AM

ఎమ్మెల్యే యత్నాళ్‌పై  సుమోటో కేసు

ఎమ్మెల్యే యత్నాళ్‌పై సుమోటో కేసు

గాంధీ, నెహ్రూలపై వివాదాస్పద ప్రసంగం

హుబ్లీ: యాదగిరిలో జరిగిన శివాజీ జయంతి కార్యక్రమంలో విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ జాతిపిత మహాత్మాగాంధీ, తొలి ప్రధాని నెహ్రూల గురించి అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఆయన తన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు స్వచ్ఛందంగా కేసు నమోదు చేసుకున్నారు. ఈ నెల 21న యాదగిరి జిల్లా గురుమఠకల్‌ పట్టణంలో జరిగిన శివాజీ జయంతి కార్యక్రమంలో ప్రసంగించిన యత్నాళ్‌ గాంధీ, నెహ్రూలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే యత్నాళ్‌కు వ్యతిరేకంగా పలు సెక్షన్ల కింద పోలీసులు సుమోటో కేసు దాఖలు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement