అగ్నిప్రమాదంలో దుకాణం బుగ్గి | - | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదంలో దుకాణం బుగ్గి

Feb 26 2026 7:30 AM | Updated on Feb 26 2026 7:30 AM

అగ్నిప్రమాదంలో దుకాణం బుగ్గి

అగ్నిప్రమాదంలో దుకాణం బుగ్గి

హుబ్లీ: కలబుర్గిలోని పాత జేవర్గి రోడ్డులో రామమందిరం సమీపంలోని ఓ ఎలక్ట్రికల్‌ దుకాణంలో బుధవారం తెల్లవారు జామున ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అశోక్‌ ప్రజాపతికి చెందిన అంగడిలో ఉదయం 4 గంటలకు జరిగిన అగ్నిప్రమాదంలో రూ.20 లక్షల విలువ చేసే ఎలక్ట్రిక్‌ సామాన్లతో పాటు రూ.50 లక్షల విలువ చేసే వస్తువులు కాలి బూడిదయ్యాయి. అశోక్‌ నగర్‌ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూటే కారణమని అనుమానించారు. కాగా ప్రమాద ఘటన సమాచారం తెలిసిన వెంటనే జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ మల్లికార్జున మార్గదర్శకత్వంలో ఏఎఫ్‌ఓ మహంతేష్‌, సిబ్బంది అష్పక్‌, సుభాష్‌, శ్రీశాంత్‌, బసవరాజు, మిరాజ్‌ చేరి 3 గంటల పాటు కార్యాచరణలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement