జ్ఞానసేతు పథకంలో జిల్లా ప్రథమం | - | Sakshi
Sakshi News home page

జ్ఞానసేతు పథకంలో జిల్లా ప్రథమం

Feb 26 2026 7:30 AM | Updated on Feb 26 2026 7:30 AM

జ్ఞాన

జ్ఞానసేతు పథకంలో జిల్లా ప్రథమం

రాయచూరు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న జ్ఞానసేతు పథకంలో రాయచూరు జిల్లా ప్రథమ స్థానం సంపాదించింది. రాయచూరు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానం ఆక్రమించడానికి కృషి చేసిన జ్ఞానసేతు ముఖ్య అధికారి సుఖదేవ్‌ను జిల్లాధికారి నితీష్‌, జెడ్పీ సీఈఓ ఈశ్వర్‌ కుమార్‌, జిల్లా విద్యా శాఖ అధికారి బడిగేర్‌ అభినందించారు.

రాఘవుని సన్నిధిలో

కన్నడ ప్రముఖులు

రాయచూరు రూరల్‌: ఆంఽధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మంత్రాలయంలో జరిగిన రాఘవేంద్ర స్వాముల పట్టాభిషేక ఉత్సవాల సందర్భంగా పలువురు కన్నడ ప్రముఖులు మంత్రాలయాన్ని సందర్శించారు. మంగళవారం సాయంత్రం మంత్రాలయ మఠంలోని రాఘవేంద్ర స్వాముల మూలవిరాట్‌ను కన్నడ సినీనటులు రిషబ్‌ శెట్టి, జగ్గేష్‌, మాజీ ఉపముఖ్యమంత్రి అశ్వత్‌ నారాయణ దర్శించుకున్నారు. మంత్రాలయ మఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్‌ వారిని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

యువకుడు దారుణ హత్య

హుబ్లీ: హుబ్లీ– గదగ్‌ రోడ్డులో ఓ యువకుడి దారుణ హత్య నగరంలో సంచలనం సృష్టించింది. వివరాలు.. గదగ్‌ రోడ్డులో హైవేలోని ఐటీసీ గ్రౌండ్‌ సమీపంలో యువకుడిని దుండగులు దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. హతుడిని మంజునాథ్‌ గాణిగెర(29) గా పోలీసులు గుర్తించారు. మృతుడు హుబ్లీ తాలూకా బండివాడ గ్రామ నివాసి అని తెలిసింది. ఎవరో దుండగులు ఇతన్ని వేరే చోట హత్య చేసి శవం అనవాలు దొరకకుండా రోడ్డుపై పడేసి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. అటుగా వెళుతున్న వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం హుబ్లీ గ్రామీణ పోలీసులు స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సమాజాభివృద్ధికి పెద్దపీట వేస్తాం

రాయచూరు రూరల్‌: వీరశైవ సమాజం అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తామని అఖిల భారత వీరశైవ మహాసభ సమాజం మహిళా అధ్యక్షురాలు నిర్మల బెణ్ణె వెల్లడించారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. సమాజంలో పేదలను గుర్తించి వారిని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యా పరంగా ముందుకు తీసుకెళతామన్నారు. సమాజంలోని భిన్నాభిప్రాయాలను తొలగించి సమాజాభివృద్ధికి పాటు పడతామన్నారు.

మహిళల సామూహిక పారాయణం

రాయచూరు రూరల్‌: మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠంలో మంగళవారం గురు రాఘవేంద్రుల పాదుకా పట్టాభిషేక ఉత్సవాల్లో భాగంగా మహిళల సామూహిక పారాయణం జరిగింది. అంతకు ముందు మూలవిరాట్టు్‌కు పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్‌ ప్రత్యేక పూజలు చేశారు. గురుసార్వభౌముల 405వ పట్టాభిషేక ఉత్సవాలు, రాయల 431వ వర్ధంతి స్మరణోత్సవ వేడుకలను వందలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం జరిపారు.

జ్ఞానసేతు పథకంలో  జిల్లా ప్రథమం1
1/4

జ్ఞానసేతు పథకంలో జిల్లా ప్రథమం

జ్ఞానసేతు పథకంలో  జిల్లా ప్రథమం2
2/4

జ్ఞానసేతు పథకంలో జిల్లా ప్రథమం

జ్ఞానసేతు పథకంలో  జిల్లా ప్రథమం3
3/4

జ్ఞానసేతు పథకంలో జిల్లా ప్రథమం

జ్ఞానసేతు పథకంలో  జిల్లా ప్రథమం4
4/4

జ్ఞానసేతు పథకంలో జిల్లా ప్రథమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement