జోన్ల మధ్య రైల్వే డివిజన్లు విలవిల | - | Sakshi
Sakshi News home page

జోన్ల మధ్య రైల్వే డివిజన్లు విలవిల

Feb 26 2026 7:30 AM | Updated on Feb 26 2026 7:30 AM

జోన్ల

జోన్ల మధ్య రైల్వే డివిజన్లు విలవిల

రాయచూరు రూరల్‌: కేంద్ర ప్రభుత్వం సుదూరంలో కొత్త రైల్వే జోన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో కళ్యాణ కర్ణాటకలోని రైల్వే డివిజన్లు విలవిలలాడుతున్నాయి. కళ్యాణ కర్ణాటకలోని కలబుర్గి రైల్వే జోన్‌ ఏర్పాటు అయ్యే వరకు షోలాపూర్‌ జోన్‌లోకి చేర్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జోన్‌ ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభం కానుంది. కళ్యాణ కర్ణాటకలోని రైల్వే డివిజన్లు జోన్ల మధ్య నలిగి పోతున్నాయని చెప్పవచ్చు. 1980లో సరీన్‌ కమిటీ కలబుర్గిలో రైల్వేజోన్‌ ఏర్పాటుకు కేంద్రానికి సిఫార్సు చేశారు. కేంద్రంలోని యూపీఏ సర్కార్‌ హయాంలో ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ ఆధ్వర్యంలో రైల్వే శాఖ మంత్రిగా విధులు నిర్వహించిన మల్లికార్జున ఖర్గే కలబుర్గి రైల్వే డివిజన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. జోన్‌ కార్యాలయం నిర్మాణానికి 40 ఎకరాల భూమిని కూడా కేటాయించారు. కాలక్రమేణ సర్కార్లు మారడంతో కాంగ్రెస్‌ సర్కార్‌ చేసిన ప్రతిపాదనను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించి జోన్‌ను ఏపీకి తరలించారు. సెంట్రల్‌ రైల్వే షోలాపూర్‌ జోన్‌ పరిధిలోకి వాడి, శహాబాద్‌, కలబుర్గిలను తరలించారు. మహారాష్ట్రకు కల్పించే సౌకర్యాలను కర్ణాటకకు కూడా కల్పించడం లేదు. కలబుర్గి నుంచి ముంబై, చైన్నె, బెంగళూరు, న్యూఢిల్లీలకు వెళ్లే రైళ్ల రాకపోకలున్నాయి. సికింద్రాబాద్‌ జోన్‌ పరిధిలోని సేడం, చిత్తాపూర్‌, సుల్తాన్‌పూర్‌, వాడి, శహాబాద్‌, కలబుర్గి, గాణగాపూర్‌ రోడ్‌, కుళలిలను షోలాపూర్‌ జోన్‌లో చేర్చారు. విశాఖపట్నం జోన్‌లోకి రాయచూరు, వాడిలను చేర్చారు. కాగా కలబుర్గిని సికింద్రాబాద్‌ జోన్‌లోకి చేర్చాలని మాజీ రైల్వే సలహా సమితి సభ్యుడు బాబూరావ్‌ డిమాండ్‌ చేశారు.

కళ్యాణ కర్ణాటకలోని

జిల్లాల్లో రెండు జోన్లు

రాయచూరు, వాడి

విశాఖపట్నం జోన్‌లోకి

కలబుర్గి, శహాబాద్‌ షోలాపూర్‌ జోన్‌లోకి

జోన్ల మధ్య రైల్వే డివిజన్లు విలవిల 1
1/2

జోన్ల మధ్య రైల్వే డివిజన్లు విలవిల

జోన్ల మధ్య రైల్వే డివిజన్లు విలవిల 2
2/2

జోన్ల మధ్య రైల్వే డివిజన్లు విలవిల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement