వీధి శునకాల కట్టడికి కొత్త వ్యూహం
బనశంకరి: బెంగళూరు నగరంలో వీధి శునకాలు దాడులు కేసులు పెరిగిపోయాయి. నిత్యం పలువురిని కుక్కలు కాటేస్తున్నాయి. దీనికి కారణం మీరంటే మీరని నగర పాలికె, ప్రజాసంఘాలు, జంతు ప్రేమికుల సంఘాలు ఆరోపణలు చేసుకుంటున్నాయి కానీ బాధితుల గోడును ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. వీధి కుక్కల విషయంలో గ్రేటర్ బెంగళూరు ప్రాధికార మరో నిబంధనను తీసుకొస్తోంది. వీధి కుక్కలకు ఎక్కడపడితే అక్కడ ఆహారం పెట్టరాదని చెబుతోంది. శునక ప్రేమికులు, ప్రజల మధ్య సంఘర్షణను తప్పించడం, స్వచ్ఛతను కాపాడటానికి ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. జీబీఏ పరిధిలోని ఐదు నగర పాలికేల్లో 450 కేంద్రాలను గుర్తించింది. అక్కడ మాత్రమే ప్రజలు వీధి శునకాలకు ఆహారం అందించాలి, త్వరలోనే అక్కడ బోర్డులు అమరుస్తామని అధికారులు తెలిపారు.
భిన్నాభిప్రాయాలు..
నగరంలో రోడ్ల పక్కన, కూడళ్లలో, ఫుట్‌పాత్‌లు, పార్కులు.. ఇలా ఎక్కడ పడితే అక్కడ కుక్కలకు తిండి పెడుతుంటారు. అలాంటివారికి జరిమానా విధిచాలని జీబీఏ నిర్ణయించిందని అధికారులు తెలిపారు. శునకాలకు ఆహారం అందించేవారు నిర్ణీత స్థలాల్లోనే ఉంచాలి, జన రద్దీ తక్కువగా ఉండే సమయంలో తిండి పెట్టాలని పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై ప్రాణిహక్కు పోరాటదారుల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. శునకాలు ఒకే ప్రాంతంలో జీవిస్తాయని, మరో ప్రాంతం కుక్కలను రానివ్వవని చెప్పారు. కుక్కలు మరోప్రాంతానికి వెళ్లి ఆహారం తినవని తెలిపారు. దీంతో ఆహార కేంద్రాలను ఇష్టారాజ్యంగా గుర్తించడం వల్ల శునకాల మధ్య పోట్లాటలు జరగవచ్చని అన్నారు.
వీధి కుక్కలపై చర్యలు వద్దంటూ జంతు ప్రేమికుల నిరసన
కబ్బన్‌పార్కులో సేదదీరుతున్న వీధి కుక్కలు
బెంగళూరులో
ఎక్కడపడితే అక్కడ తిండి పెట్టరాదు
జీబీఏ గుర్తించిన
450 కేంద్రాల్లోనే ఆహారం ఇవ్వాలి
అతిక్రమిస్తే జరిమానా
వీధి శునకాల కట్టడికి కొత్త వ్యూహం
వీధి శునకాల కట్టడికి కొత్త వ్యూహం
వీధి శునకాల కట్టడికి కొత్త వ్యూహం


