పెచ్చరిల్లిన రోడ్డు ప్రమాదాలు | - | Sakshi
Sakshi News home page

పెచ్చరిల్లిన రోడ్డు ప్రమాదాలు

Feb 24 2026 7:31 AM | Updated on Feb 24 2026 7:31 AM

పెచ్చ

పెచ్చరిల్లిన రోడ్డు ప్రమాదాలు

ఇటీవల హొసకోట వద్ద కారు, లారీ ప్రమాద దృశ్యాలు

దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. గరిష్టంగా ఆరేడు మంది, అది కూడా చిన్నవయసు యువత మరణిస్తున్నారు. గాయపడేవారికంటే మృతుల సంఖ్యే ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో యాక్సిడెంట్లకు రోజుకు 31 మంది బలవుతున్నారని సమాచారం. సరాసరి 86 మంది గాయపడుతున్నారు.

గతేడాది 11 వేల మంది బలి

● 2025లో రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 11,408 మంది మరణించగా, ఇందులో 891 మంది బెంగళూరు పరిధిలోనే చనిపోయారు.

● బెంగళూరు తరువాత రెండవ స్థానంలో బెళగావి, 3వ స్థానంలో తుమకూరు జిల్లాలు ఉన్నాయి.

● ఈ ఏడాదిలో ఒక్క జనవరిలోనే రాష్ట్రంలో 1,009 మంది అసువులు బాశారు.

● జాతీయ హైవేలు, రాష్ట్ర రహదారుల్లో ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

● అతి వేగం, నిర్లక్ష్యమే 90 శాతం కారణం. మిగతా 10 శాతం ప్రమాదాలకు నాణ్యత లేని రోడ్లదే కారణమని ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి.

నివారణ చర్యలు కావాలి

పోలీసులు నిరంతరం గస్తీ కాస్తూ అతి వేగంగా వెళ్లే వాహనాలకు జరిమానాలు విధించడం, డ్రైవర్లను తనిఖీలు చేస్తున్నారు. హాసన్‌ జిల్లాలో అశాసీ్త్రయంగా నిర్మించిన స్పీడ్‌ బ్రేకర్‌లు, రోడ్డుకు ఇరువైపులా దట్టమైన చెట్లు, తీగలవల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదే సమస్య అనేక జిల్లాల్లో ఉందని తెలిపారు. నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజాపనుల శాఖను పోలీసు శాఖ కోరింది. బాధ్యతతో డ్రైవింగ్‌ చేస్తే క్షేమంగా గమ్యం చేరవచ్చని తెలిపారు.

రాష్ట్రంలో రోజుకు 31 మంది బలి

86 మందికి గాయాలు

తీవ్రంగా యాక్సిడెంట్ల బెడద

పెచ్చరిల్లిన రోడ్డు ప్రమాదాలు 1
1/1

పెచ్చరిల్లిన రోడ్డు ప్రమాదాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement