అకాల వర్షం.. రాగి పంట నష్టం | - | Sakshi
Sakshi News home page

అకాల వర్షం.. రాగి పంట నష్టం

Feb 24 2026 7:31 AM | Updated on Feb 24 2026 7:31 AM

అకాల

అకాల వర్షం.. రాగి పంట నష్టం

మైసూరు: వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. శీతాకాలం ముగిసి ఎండాకాలం వస్తున్న తరుణంలో జిల్లాలోని కె.ఆర్‌. నగర, సాలిగ్రామ తాలూకాలలో శనివారం రాత్రి, ఆదివారం కురిసిన అకాల వర్షాలకు కళ్లాల్లో ఉన్న రాగి పంట తడిసిపోయింది. లక్షలాది రూపాయల పంటనష్టం జరిగిందని రైతులు వాపోయారు. పదుల హెక్టార్లలో కోత కోసి పంటలను ఆరబోశారు. సోమవారం మిల్లుకు తరలిద్దామని అనుకుంటూ ఉండగా వర్షం కురిసి తడిసి దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన చెందారు. చేతికాడి కూడు నోటికి రాకుండా పోయిందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నష్టపోయిన తమకు పరిహారం అందించాలని రైతులు ఎమ్మెల్యే రవిశంకర్‌, తహశీల్దార్‌కు విజ్ఞప్తి చేశారు.

ఏడాదిలో తొలి వాన

శనివారం రాత్రి తాలూకాలోని వివిధ ప్రాంతాలలో సంవత్సరంలో మొదటి వర్షం కురిసింది. చలి, ఎండల మధ్య వర్షం రాకతో జనం ఆశ్చర్యపోయారు. కె.ఆర్‌. నగర తాలూకా పరిసర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడగా, సాలిగ్రాగా తాలూకాలోని వివిధ చోట్ల అర్ధగంటకు పైగా మంచి వర్షం కురిసింది. మరోవైపు ఉత్తర కర్ణాటకలో తెల్లవారుజాము నుంచి దట్టమైన పొగమంచు ఆవరిస్తోంది. సోమవారం వేకువన ధార్వాడలో పొగమంచు నెలకొంది.

మైసూరు జిల్లాలో

రైతన్నల ఆవేదన

అనూహ్య వాతావరణం

అకాల వర్షం.. రాగి పంట నష్టం1
1/1

అకాల వర్షం.. రాగి పంట నష్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement