కారును ఢీకొని.. హెల్మెట్‌తో దాడి.. | - | Sakshi
Sakshi News home page

కారును ఢీకొని.. హెల్మెట్‌తో దాడి..

Feb 9 2026 7:51 AM | Updated on Feb 9 2026 7:51 AM

కారున

కారును ఢీకొని.. హెల్మెట్‌తో దాడి..

బనశంకరి: మద్యం మత్తులో కారు డ్రైవరుపై యువతులు హెల్మెట్‌తో దాడికి పాల్పడి వీరంగం సృష్టించిన ఘటన హుళిమావు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి 10 గంటలప్పుడు జరిగింది. స్నేహితులతో కలిసి హోటల్‌కు భోజనానికి వెళ్లిన ఉత్తర భారతదేశానికి చెందిన లీసా, మ్యాథ్యూ అనే ఇద్దరు యువతులు వీవీ రోడ్డు దోసె క్యాంప్‌ వద్ద స్కూటర్‌లో వెళ్తూ ముందున్న కారును ఢీకొట్టారు. ఈ సమయంలో కారు డ్రైవరు అహ్మద్‌ కారు దెబ్బతినిందని, రిపేరు చేయించాలని వారిని నిలదీశాడు. మత్తులో ఉన్న యువతులు తప్పు నీదే అని అతనితో వాదించి నోటికొచ్చినట్లు దూషించి హెల్మెట్‌తో కొట్టారు. స్థానికులు యువతులను సముదాయించినా రభస సృష్టించారు. జనం హుళిమావు పోలీసులకు సమాచారం అందించారు. వారు చేరుకుని యువతులను, స్కూటర్‌ను ఠాణాకు తరలించారు. అక్కడ విచారించి మందలించి నోటీస్‌ ఇచ్చి ఇంటికి పంపించారు.

అత్తమామల వేధింపులు.. కోడలు ఆత్మహత్య

దొడ్డబళ్లాపురం: కోడలిని అత్తమామలు వేధించడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన బీదర్‌ జిల్లా బసవ కళ్యాణ పట్టణంలోని ఓం కాలనీలో జరిగింది. అంజనాబాయి (22)కి నాలుగేళ్ల కిందట బసవ కళ్యాణలోని శేఖర్‌ పాటిల్‌ అనే వ్యక్తితో వివాహం జరిగింది. 11 నెలల పాప ఉంది. శేఖర్‌ పానీపూరి వ్యాపారం చేస్తుండగా ఉదయం వెళ్తే అర్ధరాత్రి ఇంటికి వచ్చేవాడు. ఇంట్లో కోడలిని అత్త మామలు సూటిపోటి మాటలతో వేధించేవారు. చూడడానికి అందంగా ఉంటే చాలదు, పుట్టింటి నుంచి మరింత కట్నం తేవాలని, ఎలాగైనా డబ్బు సంపాదించి తేవాలని పీడించేవారు. దీంతో అంజనాబాయి పలుమార్లు తన తల్లిదండ్రులకు చెప్పుకున్నా ఫలితం లేకపోవడంతో విరక్తి చెంది, ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి భర్త, అత్తమామలను అరెస్టు చేశారు.

చేపల కోసం వెళ్లి ఇద్దరు జలసమాధి

దొడ్డబళ్లాపురం: ఓ పొలంలోని నీటి కుంటలో చేపలు పట్టడానికి వెళ్లిన ఇద్దరు నీటమునిగి మృతిచెందిన సంఘటన మాగడి తాలూకా చందురాయనపాళ్యలో జరిగింది. శంకర్‌ (32), బంధువు మోహిత్‌ (17) మృతులు. ఆదివారంనాడు ఉదయం సమీపంలోని ఫారంపాండ్‌లో చేపలు పట్టేందుకు వెళ్లారు. అయితే ఒకరు నీటిలో పడిపోవడంతో కాపాడబోయి మరొకరు నీటమునిగి చనిపోయి ఉంటారని అనుమానాలున్నాయి. మాగడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

రౌడీపై పోలీసుల కాల్పులు

భద్రావతిలో గోలీమార్‌

శివమొగ్గ: పోలీసులపై రాళ్లు, కత్తులతో దాడి చేయడానికి ప్రయత్నించిన పేరుమోసిన రౌడీషీటర్‌ మీద ఖాకీలు కాల్పులు జరిపారు. శివమొగ్గ జిల్లాలోని భద్రావతిలోని శివానీ క్రాస్‌ సమీపంలోని గౌరపుర సమీపంలో ఈ సంఘటన జరిగింది. వివరాలు.. రౌడీషీటర్‌ డిచ్చి ముబారక్‌కు పలు నేరాలతో సంబంధముంది. శుక్రవారం జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. కానీ శనివారం రాత్రి అతను ఏడెనిమిది మందిని వెంటేసుకుని కార్లు, బైక్‌లలో కత్తులు కఠార్లు తీసుకుని భద్రావతి శివార్లలో తిరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వారిని అదుపులోకి తీసుకోవాలని పోలీసులు వచ్చారు, ముబారక్‌, అనుచరులు రాళ్లు, కత్తులతో పోలీసులపై దాడికి ప్రయత్నించారు. వెంటనే ఎస్‌ఐ కృష్ణకుమార్‌ మానే గాల్లోకి కాల్పులు జరిపి లొంగిపోవాలని హెచ్చరించారు. ముబా రక్‌ కత్తితో దాడి చేయగా, అతని కాలిపై కాల్చడంతో పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. నలుగురు దుండగులను అరెస్టు చేశారు. ఈ గొడవలో ఎస్‌ఐలు కృష్ణకుమార్‌, సిద్ధప్ప, కానిస్టేబుల్‌ ఆదర్శ్‌ గాయపడి శివమొగ్గ మెగ్గాన్‌ ఆసుపత్రిలో చేరారు.

కారును ఢీకొని..  హెల్మెట్‌తో దాడి.. 1
1/2

కారును ఢీకొని.. హెల్మెట్‌తో దాడి..

కారును ఢీకొని..  హెల్మెట్‌తో దాడి.. 2
2/2

కారును ఢీకొని.. హెల్మెట్‌తో దాడి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement