క్రీడలతో మానసిక ఉల్లాసం
మాలూరు: యువకులు దురలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఉత్తమ ఆరోగ్యం కలిగి ఉండాలని సీఐ హరీష్ రెడ్డి సూచించారు. వేమన జయంతిని పురస్కరించుకొని తాలూకాలోని చిక్కతిరుపతి గ్రామంలో మహాయోగి వేమన బళగ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన వేమన కప్ సీజన్ – 2 క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వేమన ఆదర్శాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. విశ్రాంత వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎస్‌సీవీ రెడ్డి, గ్రామ పంచాయతీ సభ్యులు పాల్గొన్నారు. పోటీల్లో మొత్తం ఆరు జట్లు పాల్గొన్నాయి.


