యువత క్రీడలపై ఆసక్తి చూపాలి
శ్రీనివాసపురం: మొబైల్ వాడకం ద్వారా బీపీ, షుగర్‌తో పాటు అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని, విద్యార్థులు మొబైల్ వాడకాన్ని తగ్గించాలని ఏపీలోని అన్నమయ్య జిల్లా డీఎఫ్‌ఓ జగన్నాథ సింగ్ సూచించారు. పట్టణంలోని అమాని చెరువులో జేపీసీ క్రికెట్ జట్టు నేతృత్వంలో ఏర్పాటు చేసిన పునీత్ రాజ్‌కుమార్ కప్ – 2026 క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే దైహికంగా దృఢంగా ఉండాలన్నారు. క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు.ఉత్తమ ప్రదర్శన ఇవ్వడమే ధ్యేయంగా కలిగి ఉండాలన్నారు. అనంతరం అడ్డగల్ క్షేత్ర కోముల్ డైరెక్టర్ మంజునాథ్ మాట్లాడారు. పోటీల్లో 16 జట్లు పాల్గొన్నాయి. సీఐ శంకరాచార్, పురసభ ముఖ్యాధికారి నాగరాజ్, ప్రభుత్వ ఆస్పత్రి పాలనాధికారి డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. కాగా ఈ పోటీలు మూడు రోజులపాటు కొనసాగనున్నాయి.


