నాగలాపుర కొండపై భక్తులకు సదుపాయాలు
కోలారు: తాలూకాలోని నాగలాపుర కొండపై కొలువైన శ్రీ క్షేత్ర వీరభద్రస్వామి భక్తుల సౌకర్యార్థం రూ. 50 లక్షలతో నిర్మించ తలపెట్టిన సముదాయ భవననిర్మాణ పనులను ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్ ఆదివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సుమారు 15 గ్రామాల గ్రామ దేవతామూర్తులు ఒకచోటకు చేరడంతో జాతర జరుగుతుందన్నారు. దీంతో వేల సంఖ్యలో భక్తులు హాజరువుతారన్నారు. వారికి సరైన సదుపాయాలు లేకపోవడంతో సముదాయ భవనం, దాసోహ భవనం, శౌచాలయం, స్నానపు గదుల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. దాతలు ముందుకు వచ్చి సహకారం అందిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ అనిల్‌కుమార్, నాగలాపుర వీరధర్మ సింహాసన మహాసంస్థాన మఠం పీఠాధ్యక్షుడు తేజేశలింగ శివాచార్య స్వామీజీ, డీసీసీ బ్యాంకు డైరెక్టర్ ఖాజీ కల్లహళ్లి మునిరాజు పాల్గొన్నారు.


