పక్షుల సంరక్షణ మనందరి బాధ్యత
రాయచూరు రూరల్: పక్షుల సంరక్షణ మనందరి బాధ్యత అని ప్రవాసాంద్రుడు సూర్యదేవర నాగేశ్వరావు పేర్కొన్నారు. ఆదివారం టి.ఎస్.ఎస్ సభాంగణంలో పక్షుల ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. 150 కి పైగా ప్రదర్శించిన పక్షుల ఫొటోలను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి ఆధునిక యుగంలో పక్షుల సంతతి అంతరిస్తోందన్నారు. ఈ తరుణంలో విద్యార్థులు, భావి తరాలకు గుర్తుండేలా పక్షుల ఫొటోలను తీసి ప్రదర్శించిన ఈరణ్ణ సేవలు అభినందనీయమన్నారు. భవిష్యత్తులో పక్షుల రక్షణకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేమ్స్, భీమన గౌడ ఇటగీ, బషీరుద్దీన్, అమరే గౌడ తదితరులు పాల్గొన్నారు.


