రక్షకభటులే విరక్తి చెందితే..
మండ్య: రాష్ట్రంలో మండ్య, శివమొగ్గలో ఇద్దరు పోలీసులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. మండ్య జిల్లాలో మద్దూరు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసే టి. రమేష్ (35) బుధవారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చిక్కబళ్లాపురంలోని దబలగెరె గ్రామానికి చెందిన రమేష్‌కు భార్య పుష్పలత, ఏడాదిన్నర కూతురు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం మద్దూరు స్టేషన్‌కు బదిలీ అయ్యాడు, కోర్టు వారెంట్లు, సమన్లను రవాణా చేసే పనిలో ఉన్నాడు. ఇంటికి వచ్చి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసిన రమేష్ ఒక గదిలో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. కుటుంబ వివాదాలే కారణమని అనుమానాలున్నాయి. పోస్టుమార్టం తరువాత మృతదేహాన్ని స్టేషన్‌కు తీసుకువచ్చి, సిబ్బంది, ప్రజల సందర్శనార్థం ఉంచారు. తరువాత స్వగ్రామానికి తరలించి కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు జరిపారు.
ఠాణాలోనే హెడ్ కానిస్టేబుల్..
శివమొగ్గ: నగరంలోని వెస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడు జకారియా (53), ఆర్‌ఎంఎల్ నగర నివాసి. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. నైట్ షిఫ్ట్ డ్యూటీలో ఉన్న జకారియా తన సహోద్యోగిని విశ్రాంతి తీసుకోమని కోరాడు. సరేనని సహోద్యోగి నిద్రపోయాడు, తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మెలకువ వచ్చి చూడగా జకారియా ఉరికి వేలాడుతున్నాడు. ఓ కానిస్టేబుల్‌తో విభేదాల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు జకారియా డెత్‌నోట్ రాసి ఉంచాడు. పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు పోలీసుల బలవన్మరణాలు ఆ శాఖలో కలకలం సృష్టించాయి.
కానిస్టేబుల్ రమేష్ హెడ్ కానిస్టేబుల్ జకారియా
రాష్ట్రంలో ఇద్దరు పోలీసుల ఆత్మహత్య
రక్షకభటులే విరక్తి చెందితే..


