రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం
సాక్షి,బళ్లారి: వారందరూ వక్కలు వ్యాపారం చేసేవారు. వక్కతోటకు వెళ్లి పంట కోయడానికి ఏర్పాట్లు చేసుకుని తిరిగి వస్తుండగా, రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మంగళవారం రాత్రి చిత్రదుర్గ జిల్లా హొళల్కెరె తాలూకా సాసలు సమీపంలో బొలెరో వాహనం బోల్తా పడటంతో కల్లవ్వనాగతిహళ్లి గ్రామానికి చెందిన గిరిరాజ్, కిరణ్, అరుణ్, హనుమంతప్ప అనే నలుగురు మృతి చెందారు. బొలెరో వాహన డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యంతో వాహనం నడుపుతూ రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీకొట్టడంతో ఘటన స్థలంలో, గాయపడిన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మరో ఇద్దరు కలిపి మొత్తం నలుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని దావణగెరె ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే హొళల్కెరె పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని జీవించే వక్కల వ్యాపారులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కల్లవ్వనాగతిహళ్లిలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
బొలెరో వాహనం బోల్తా
చిత్రదుర్గం జిల్లాలో ఘోరం
ఘటనా స్థలంలో ఇద్దరు మృతి
ఇదే ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు
ఆస్పత్రికి తరలిస్తుండగా
మరో ఇద్దరు మృతి


