వైభవంగా కాడుగొల్లర చాతప్ప దేవర జాతర
చెళ్లకెరె రూరల్: తాలూకాలోని పుర్లహళ్లి గ్రామంలో కాడుగొల్లర ఆరాధ్య దైవం చాతప్ప దేవర జాతర అశేష భక్తుల నడుమ వైభవంగా జరిగింది. ఈ జాతరలో 5 మంది వీరగారరు ఉపవాసం ఆచరించి 20 అడుగుల ఎత్తు గల ముళ్లకంపలపై ప్రతిష్టించిన కలశాన్ని తీసుకురావడం విశేషం. కొర్లగుంటె గ్రామానికి చెందిన మహంతేష్ పోటీ పడి ముళ్లకంపల పైకి ఎక్కి కలసాన్ని తీసుకొచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే టి.రఘుమూర్తి, కాడుగొల్లర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజన్న, యాదవానంద స్వామీజీ, రమానంద స్వాములు పాల్గొన్నారు.


