స్కావెంజర్లతో మలమూత్రాదుల తొలగింపు సరి కాదు
రాయచూరు రూరల్: రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్) కళాశాల ఆస్పత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వహించే స్కావెంజర్లతో మలమూత్ర తొలగింపు పనులు చేయిస్తున్నారని బహుజన దళిత సంఘర్ష సమితి సంచాలకుడు నరసింహులు ఆరోపించారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ స్వామ్యంలో పని చేస్తున్న అధికారులు సఫాయి కర్మచారులతో మ్యాన్ హోల్‌లో నిండిన మలమూత్రాదులను గుంతలోకి దింపి తొలగించే పనులు చేయిస్తున్నారని, బాధ్యులపై చర్యలు చేపట్టాలన్నారు. కాంట్రాక్ట్ పొందిన సంస్థ లైసెన్స్‌ను రద్దు చేయాలని ఒత్తిడి చేశారు. సఫాయి కర్మచారులతో కాంట్రాక్ట్ పద్ధతిపై నియమించుకున్న సంస్థలు నిండిన మ్యాన్‌హోల్‌లోకి దింపి పనులు చేయించారని, వారికి ఎలాంటి రక్షణ, భద్రతా చర్యలు తీసుకోలేదన్నారు.


