సెలవు తీసుకోకుండా విధులకు గైర్హాజరు కావడం దుష్ప్రవర్తనే
● కర్ణాటక హైకోర్టు తీర్పు
శివాజీనగర: సెలవు తీసుకోకుండా విధులకు గైర్హాజరు కావడం దుష్ప్రవర్తన అని, శ్రద్ధతో పని చేయని ఉద్యోగిపై సానుభూతి చూపాల్సిన అవసరం లేదని కర్ణాటక హైకోర్టు వెల్లడించింది. అనధికారికంగా ఉద్యోగానికి గైర్హాజరైన నేపథ్యంలో ట్రైనీ డ్రైవర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తిని సేవల నుంచి తొలగించిన ఆదేశాలను కార్మిక న్యాయస్థానం రద్దు చేసింది. ఈ ఆదేశాలను ప్రశ్నిస్తూ బీఎంటీసీ సమర్పించిన పిటిషన్‌ను న్యాయమూర్తి ఎం.జ్యోతి ధర్మాసనం విచారించింది. సెలవు కోరటం గాని, ముందుగా అనుమతి తీసుకోకుండా అనధికారికంగా విధులకు గైర్హాజరైన నేరం రుజువైన నేపథ్యంలో బీఎంటీసీ క్రమశిక్షణ ప్రాధికార ఉద్యోగిని సేవల నుంచి సస్పెండ్ చేసింది. ఉద్యోగ నిర్వహణ సమయంలో సరైన కారణం లేకుండా విధులకు ఉద్యోగి అనధికారికంగా గైర్హాజరు కాకూడదు. అలాంటి దుష్ప్రవర్తన క్రమశిక్షణ చర్యలను సమర్థిస్తుందని న్యాయస్థానం అభిప్రాయపడింది.


